Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
పురపాలక సంఘం పరిది బహదూర్పేట వద్ద చెరువు అలుగును కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని 6 వార్డు బహదూర్ పేట కాంగ్రెస్ సీనియర్ నాయకులు వట్టిపల్లి సిద్దిరాజు, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి దొంతుల ఎల్లేశ్ కోరారు. బహదూర్ పేట పులి చెరువు లో ఇటీవల భారీ వర్షాలు కురువడం తో భారీగా నీరు చేరడం తో ప్రవాహానికి చెరువు అలుగు పోస్తుండడం కొందరు రియల్ ఎస్టేట్దారులు మట్టి అడ్డు పోశారు. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని గ్రామంలో గురువారం అలుగు వద్ద నిరసన తెలిపారు. ఇరిగేషన్ అధికారులకు స్థానిక రెవెన్యూ అధికారులకు స్థానిక కౌన్సిలర్ సర్ది చెప్పడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయపూరం నర్సిహులు , మహేష్, వట్టిపల్లి శ్రీనివాస్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.