Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్
నవతెలంగాణ - భువనగిరి
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వార్త సేకరణకు వెళ్లిన చౌటుప్పల్ నవ తెలంగాణ రూరల్ విలేకరి పిశాటి.నాగరాజ్ రెడ్డిపై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఖాజా ఫసిఉద్దీన్ మాట్లాడారు. పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నాగరాజు పైపెట్టిన కేసు ఉపసంహరించుకోవాలన్నారు. ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చి జిల్లా స్థాయి ఉద్యమం నిర్వహించడానికి వెనకాడది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అక్రమ కేసులు విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దం ఉదరు కుమార్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న ,జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహ్మహన్ ,పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పలపల్లి నరేందర్ పాల్గొన్నారు.