Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రూట్లల్లోనూ ఆర్టీసీ బస్సులను నడిపించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు మేకల జలెందర్ మాట్లాడుతూ మండలంలోని వివిద గ్రామాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు మండల కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాలలోని విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్నారు. కనీసం బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా పెనుభారం మోయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పలపల్లి మత్స్యగిరి, బత్తిని సందీప్, ఉప్పలయ్య, రజాక్, జంపాల ప్రణతి, అప్పం పల్లవి, గట్టు ఉదరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.