Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌పై అవగాహన అవసరం
- కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా లబ్దిదారులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ పాటిల్హేమంత కేశవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు వికలాంగులు, వయోవద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ హెల్త్ట్రాకింగ్ సిస్టం మొబైల్ అప్లికేషన్ యాప్‌పై శిక్షణా కార్యక్రమం సూపర్వైజరి సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాంపై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చేసే సేవల వివరాలు, పనుల వివరాలు, నెలవారి రిపోర్టులు,లబ్దిదారుల పూర్తి వివరాలను ఈ అప్లికేషన్ యాప్ ద్వారా చేశామన్నారు.ప్రతిరోజు అంగనవాడీకేంద్రానికి వచ్చే లబ్దిదారులు ఎలాంటి సేవలు పొందుతున్నారు, ఎన్ని రోజులు పొందారు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందనే వీలును ప్రభుత్వం రూపొందించిందన్నారు.సరైన సమయంలో సరైన పర్యవేక్షణలో అంగన్వాడీ సేవలు మరింత విస్తతపరచడానికి ఈ యొక్క అప్లికేషన్ యాప్ దోహదపడుతుందని తెలిపారు.క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు సమీక్షలు చేసుకోవడానికి కల్పించే విధంగా ఈ అప్లికేషన్‌ను రూపొందించారన్నారు.ఈ యాప్ ద్వారా అంగన్వాడీ టీచర్లకు పనిభారం,ఒత్తిడి తగ్గుతాయన్నారు.అనంతరం పోషక విలువలు, విధివిధానాలకు సంబంధించిన బ్రోచర్స్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, ఐటీ కోఆర్డినేటర్ రవికుమార్, సీడీపీఓలు విజయలక్ష్మీ, విజరుచంద్రిక, కిరణ్మయి, శ్రీజ, వాణి, రూప, సాయిగీత, పోషన్అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్, జిల్లాలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, జిల్లా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.