Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి కల్యాణ్‌చక్రవర్తి అన్నారు.గురువారం మండలంలోని ప్రాథమికఆరోగ్య కేంద్రం పెంచికల్‌దిన్నెలో ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు సమీకృత ఆరోగ్య కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నోరు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార పరీక్షలు నిర్వహించాలన్నారు.క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఆధునికకాలంలో క్యాన్సర్లు ఎవరికైనా వచ్చే అవకాశం ఉందన్నారు.జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో ప్రజలను చైతన్యం చేసి ఉచిత క్యాన్సర్ నిర్దారణపరీక్షలు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హరికిషన్, ఎన్సీడీ అధికారి సాంబశివరావు, ఫార్మాసిస్టులు, సూపర్వైజర్లు,ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.