Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
రైతులు పశువైద్య శాఖ ఇస్తున్న సూచనలు, సలహాలు పాటించి పశుసంపదను పెంచుకోవాలని కలెక్టర్ పాటిల్‌హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం మండలపరిధిలోని అడ్లూరు గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువుల గర్భకోశ వ్యాధుల నివారణ ఉచిత చికిత్సాశిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి పశుసంపద కీలకమన్నారు.పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు పశు వైద్య శాఖ సేవలు, గర్భకోశ వ్యాధుల చికిత్సకు వాడుతున్న అత్యాధునిక పరికరాలు, వాటి ఉపయోగాలను కలెక్టర్ కువివరించారు.కాగా కలెక్టర్ గ్రామం లో పర్యటించి పశుగ్రాసపెంపకం, పాడి గేదెల పెంపకాన్ని పరిశీలించారు.మండల పశువైద్యాధికారి నాగేంద్రబాబు మాట్లాడుతూ శిబిరంలో 30 గేదెలకు గర్భ కోశ వ్యాధులకు ఉచితంగా చికిత్స, దూడలకు సామూహిక నట్టల నివారణ మందులు పంపిణీ చేశామని తెలిపారు.పంచాయతీ కార్యదర్శిని వైకుంఠదామం, గ్రామపంచాయతీ సమస్యలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు.పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామ సమస్యలు ఎవరు పట్టించుకోవడంలేదని, గ్రామంలో లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌కు ఆరోగ్యం బాగో లేకపోవడంతో గ్రామంలో సమస్యల తిష్టవేసినట్టు వేసినట్టు తెలిపారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్యదర్శి కావ్యరెడ్డికి సూచించారు.ఈకార్యక్రమంలో డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సురేందర్, డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పశు వైద్య సిబ్బంది ఖాన్, సాయికృష్ణ, గోపాలమిత్రలు నాంచారయ్య, శ్రీను, ప్రసాద్, ఉపసర్పంచ్ జెట్టి లచ్చిరెడ్డి, పాడిరైతులు వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.