Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
విద్యార్థులలో వైజ్ఞానిక స్పృహకు చెకుముకి ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఈఓ అశోక్‌తో కలిసి చెకుముకి పోటీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెకుముకి సైన్స్ సంబురాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందిస్తూ భావిభారత శాస్త్రజ్ఞులుగా మలుచుటకు జ్ఞన విజ్ఞాన వేదిక కృషి చేయాలని సూచిం చారు.జిల్లాలో 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటున్నారని,పాఠశాల స్థాయి నవంబర్ 18, మండలస్థాయి 22, జిల్లాస్థాయి 27 తేదీలలో అలాగే సిరిజిల్లాలోని రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 9,10,11వ తేదీలల్లో జరుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక జిల్లా, రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జి. రమేశ్‌బాబు,షేక్ జాఫర్, సభ్యులు నారాయణరెడ్డి, డి.జనార్దన్, కె.శ్రవణ్‌కుమార్, ఆంజనేయులు, సైదులు తదితరులు పాల్గొన్నారు.