Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓటమి ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉన్నప్పటికీ బీజేపి కావాలని ఉపఎన్నిక తెచ్చి రాజగోపాల్ రెడ్డిని పావుగా వాడుకుందన్నారు. వేల కోట్ల కాంట్రాక్టు కోసం తల్లి లాంటి కాంగ్రెస్‌ని వీడి స్వలాభం కోసం బీజేపీలో చేరి ద్రోహం చేశాడని ఆరోపించారు. రాజగోపాల్ తీరు నియోజకవర్గ ప్రజలు గుర్తించి అధికార టీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తుతో ప్రజల్లో బలం పుంజుకుందన్నారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవాలంభించే బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని నియోజకవర్గ ప్రజలు అర్ధం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ధనబలం, నిఘా సంస్థలు, దౌర్జన్యాలకు పాల్పడ్డ బీజేపీ గెలుపుపై ఆశలు వదులుకొని ఎన్నిక రద్దు చేయాలంటుందని చెప్పారు. సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు నియోజకవర్గ అభివృద్ధికి పట్టుబడుతారని విశ్వాసించిన ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతమ్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బావండ్ల పాండు, శశిధర్‌రెడ్డి, సీతారాంలుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.