Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలుకు ఖరారుగాని ముహూర్తం
- మార్కెట్కు చేరిన వేల క్వింటాళ్ల ధాన్యం
- రోజుల తరబడి ఎదురు చూస్తున్నామని రైతుల ఆవేదన
నవతెలంగాణ-నార్కట్పల్లి
పండించిన పంటను అమ్మడం కోసం రైతులు అరిగోస పడాల్సిన పరిస్థితి దాపురించింది. మండలంలో ఐకెేపీ ఆధ్వర్యంలో కేంద్రాలను ప్రారంభించి వారం రోజులు అవుతున్నప్పటికీ నేటికీ కూడా కొనుగోలు ప్రారంభించలేదు. ఏ కేంద్రంలో కూడా కనీస సౌకర్యాలైన మంచినీరు, నీడ, విద్యుత్ సౌకర్యం ఇంకా ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు ఆకాశం వైపు చూస్తూ పండించిన పంటను కాపాడుకోవడం కోసం గోస పడుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు గాలి వీస్తుందో.. ఎప్పుడు పెను ప్రమాదం వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామంటే కొనేవారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 రోజుల నుంచి పండించిన పంటకు కోతలు కోసి వేల క్వింటాళ్ల ధాన్యం రాసులుగా పోసి మార్కెట్లో ఎదురుచూస్తున్నారు. మండల వ్యాప్తంగా 11,156 ఎకరాల్లో ఎకరాల్లో దొడ్డురకం వరి పంట సాగు చేశారు.
కొనుగోలుకు ఖరారుగాని ముహూర్తం..
15,238 మంది రైతులు 50వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలు సాగు చేసుకున్నారు. కొనుగోలుకు ఖరారు కాని ముహూర్తం. మండలవ్యాప్తంగా 29 గ్రామపంచాయతీలో 19 రెవెన్యూ గ్రామాలలో పీఏసీఎస్ ద్వారా 6 కేంద్రాల్లో
ఐకేపీ ద్వారా 14 కేంద్రాలను ఏర్పాటు చేసి గతంలో ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం నుంచికొనుగోలుకు ఇంకా ముహూర్తం ఖరారు కాకపోవడంతో అధికారులు సైతం కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. ధాన్యంలో రాళ్లు రప్పలు చెత్తాచెదారం లేకుండా ప్రతి కేంద్రానికి గాలిపంకలను ఏర్పాటు చేశారు. కాని ఇంకా ఎక్కడ కూడా కొనుగోలును ప్రారంభించలేదు.
మార్కెట్కు చేరిన వేలక్వింటాళ్ల ధాన్యం..
మండలపరిధిలోని మాధవయడవెల్లి, నెమ్మాని, తొండాయి, జువ్విగూడెం, చిన్నతుమ్మలగూడెం, అక్కెనపల్లి, అమ్మనబోలు, బ్రాహ్మణవెల్లెంల, మాండ్ర, షాపెల్లి, నక్కలపల్లి, పల్లెపహాడ్ గ్రామాల్లో రైతులుఇప్పటికే తమ పండించిన పంటను ప్రభుత్వమద్దతుధరకు అమ్మడం కోసం రాసులుగా ఆయా గ్రామాల మార్కెట్లకు తరలించారు. 40 రోజుల నుంచిపగలు రాత్రి తేడా లేకుండా పండించిన ధాన్యాన్నికంటికి రెప్పలా కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడుతున్నారు అడపా దడపా. కురుస్తున్న వర్షాలు రైతులకు ఇబ్బందికలిగిస్తూ కలిగిస్తున్నాయి.
టార్పాలిన్లకు వేల రూపాయలు చెల్లిస్తున్నాం..
ఈడునూరి సరితా రవీందర్ రెడ్డి (సర్పంచ్ బాజకుంట)
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడవకుండా కాపాడుకోవడానికి టార్పాలిన్లు లేకపోవడంతో రోజుకు పదిహేను రూపాయలు చొప్పున 50 టార్పాలిన్లు అద్దెకు తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నార.
40 రోజులుగా ఎదురు చూస్తున్నా..
మహేశ్వరం సువర్ణ రవీందర్రెడ్డి (బాజకుంట, రైతు)
ఆరుగాలం కష్టించి తనకున్న 20 ఎకరాల పొలంలో వరి పండించి అమ్ముకునేందుకు ప్రభుత్వం నుంచి మద్దతుధర పొందేందుకు 40 రోజుల కిందబాజ కుంట మార్కెటుకు ధాన్యం తీసుకొచ్చా. పండించినపంటను సాగు చేయడం ఒకటైతే అమ్ముకోవడం మరోవంతైంది. ఏప్పుడు వర్షం వస్తుందో... ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ధాన్యానికి కాపలా కాయాల్సి వస్తుంది. అధికారులు స్పందించి ధాన్యాన్ని ఇప్పటికైనా కొనుగోలు చేయాలి.