Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రాస్ ఓటింగ్ పై అభ్యర్థుల్లో గుబులు
- మధ్యాహ్నం తర్వాత బారులు తీరిన ఓటర్లు
- పెరిగిన ఓటింగ్ శాతం...
- ఎవరికి లాభం... ఎవరికి నష్టం...
నవతెలంగాణ- మిర్యాలగూడ
మునుగోడు ఉప ఎన్నిక తుది అంకానికి చేరింది. గురువారం పోలింగ్ ముగిసి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఉదయం ఏడు గంటల..కు ప్రారంభమైన పోలింగ్ రెండు గంటలపాటు సాఫీగా సాగింది. ఆ తర్వాత మరో రెండు గంటలు ఓటర్లు లేక పోలింగ్ నమోదు నత్తనడకంగా జరిగింది. మళ్లీ 12 గంటల తర్వాత పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఓటర్లు బారులు తీరారు. తొలుత రెండు ప్రధాన పార్టీలు రూ.3000 చొప్పున డబ్బులు పంచారు. మరో మారు డబ్బులు పంచుతారని ప్రచారం జరగడంతో ఆ డబ్బుల కోసం ఓటర్లు వేచి తీశారు. మళ్లీ ఓ పార్టీ ఓటుకు 1000 ,2000 చొప్పున ఇవ్వడంతో మధ్యాహ్నం ఓట్లు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరో పార్టీ ఒకేసారి ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేశారు. ఇందులో ప్రధానంగా ఎక్కువగా మహిళా ఓటర్లకే ఇచ్చినట్లు సమాచారం.
క్రాసింగ్ ఓట్లపై అభ్యర్థుల్లో గుబులు
ఓ ప్రధాన పార్టీకి చెందిన సాంప్రదాయ ఓటు బ్యాంకు క్రాసింగ్ అయినట్లు విశ్వసినీయ సమాచారం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో ఉన్న యువత ఎక్కువగా ఓ పార్టీకి ఓట్లు వేశారని ప్రచారం జరుగుతుంది. మహిళలు, యువకులు, తటస్థ ఓటర్లు, వలస వెళ్లిన ఓటర్లు కీలకంగా మారారు. ఒక పార్టీల అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడడం పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతో ఆ రెండు పార్టీలకే క్రాసింగ్ ఓట్లు పడి ఉంటాయని రాజకీయ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. ఈ ఓట్లు ఎవరికి ఎక్కువగా పడితే వారే విజయం సాధిస్తారని, అది కూడా స్వల్ప మెజార్టీతో గెలుస్తారని ప్రచారం నడుస్తుంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులను టెన్షన్ నెలకొంది.
పెరిగిన ఓటింగ్ శాతం
ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది నియోజవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి పెద్ద మొత్తంలో ఓటర్లు తమ ఓటు హక్కును వేయించుకున్నారు. ఉదయం రెండు గంటలు పాటు మామూలుగా సాగిన ఓటింగ్ మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాలలో బారులు తీరారు. ఒక్కొక్కరికి ఓటు వేసేందుకు రెండు గంటలు సమయం పట్టింది. సాయంత్రం వేళలో అదే స్థాయిలో ఓటర్లు తరలిరావడంతో బూతులోనే నిలబడి ఓటు వేశారు. గడువు సమయం ముగిసినప్పటికి అప్పటికే క్యూ లైన్లో నిలబడిన వారికి అవకాశం ఇవ్వడంతో ఓట్లు వేశారు. కొన్ని కేంద్రాలలో రాత్రి వరకు ఓట్లు వేశారు. దీంతో ఓటింగ్ శాతం పెద్ద ఎత్తున పెరిగింది. పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం చేకూరుతుందో...ఎవరికి నష్టం కల్గుస్తుందో అని ఓట్లర్లు విశ్లేషించుకుంటున్నారు.