Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచకొండ సీపీ మహేష్ భగవత్
- 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచాలని రాచకొండ సీపీ ఎం.మహేష్ భగవత్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 7 గంటలకే మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైందన్నారు. పోలింగ్ ప్రారంభమయ్యాక మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో స్థానికుల ఫిర్యాదు మేరకు ఎన్నికల అధికారి తనిఖీ చేయగా గ్రామంలోని ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నాయకుల వద్ద రూ.లక్షా 96 వేల నగదు, పదివేల పై చిలుకు మద్యం, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నారాయణపురం పుట్టపాక మధ్యలో మరో రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి వి.రాగ్యనాయక్ వెల్లడించారు. వీటితో పాటు పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల పోలింగ్ సరళిని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా ప్రజలు నాయకులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని అల్లందేవి చెరువు పోలింగ్ కేంద్రం 82లో ఈవీఎం మొరాయించడంతో అరగంటసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు ఈవీఎం ను బాగు చేసి తిరిగి పోలింగ్‌ను ప్రారంభించారు.
చౌటుప్పల్ మండలంలో 93.68 శాతం పోలింగ్
నవతెలంగాణ- చౌటుప్పల్‌రూరల్
మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీల పరిధిలో 68 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా 59,433 ఓట్లు ఉండగా 29,882 పురుషులు, 29,547 స్త్రీలు, నాలుగు థర్డ్ జెండర్ ఓట్లు ఉన్నాయి. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో మండల వ్యాప్తంగా 93.68 శాతం (55,679) ఓట్లు నమోదు అయ్యాయి.