Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాధి బారికి గురై చనిపోతున్న పశువులు
- ఆందోళనలో పాడిరైతులు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలో అనేక పశువులకు పాడి గేదెలు లంపి స్కిన్ వ్యాధికి గురై చనిపోతున్నాయి. ఈ వ్యాధి రైతుల్లో కలకలం రేపుతోంది. పట్టించుకోవాల్సిన పశువైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అనేక మంది రైతుల పశువులు మృత్యువాతపడుతున్నాయి. పశువైద్యాధికారులు వ్యాధి రాకుండా ఎలాంటి వ్యాక్షిన్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశు వైద్య కారులకు రైతులు తమ పశువులకు వ్యాధి వచ్చింది అని చెప్పినా మా దగ్గర దానికి మందులు లేవు అని ప్రయివేట్ మెడికల్ షాపులకు పంపిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. పశువుల వైద్యాధికారి సమయానికి రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అందుబాటులో ఉన్న అటెండర్ ని మంద ఇవ్వమంటే రూ.500లు ఇస్తే తప్ప తమ పశువుల దగ్గర ఇంజక్షన్ వేయమని చెప్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మండల కేంద్రంలో అనేక మంది రైతులు తమ పశువులకు వచ్చిన వ్యాధిని నయం చేసుకునేందుకు వేల రూపాయలు ప్రైవేటు వ్యక్తులకు వెచ్చించి ఆర్థిక నష్టాలకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని వ్యాధి సోకిన పశువులకు ఇంజక్షన్లు వేసి నయం చేయాలని రైతులు కోరుతున్నారు.
వెంటనే వ్యాక్సినేషన్ వేయాలి
జలెందర్, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు నాయకులు
లంపి స్కిన్ వ్యాధికి గురైన పశువుల తో పాటు వ్యాధి సోకని పశువులకు ముందు జాగ్రత్త చర్యలుగా వాక్సినేషన్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి . ఈ వ్యాధి నివారణకు సంబంధించిన మందులను వైద్య ఆస్పత్రిలో అందుబాటులో ఉంచి రైతుల దొడ్ల వద్ద వైద్య సేవలు అందించాలి.