Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లోని మార్కెట్కేంద్రాల్లో ధాన్యం పోసి 25 రోజుల అవుతోందన్నారు. కొన్ని ప్రాంతాలలో కొనుగోళ్లు ప్రారంభమైన అనేక ప్రాంతాలలో కొనుగోళ్లు ఇప్పటివరకు ప్రారంభం కాలేదన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలలో రైతులు కష్టపడి పండించిన పంటను కోసి అమ్మడం కోసం మార్కెట్ యార్డుల్లో ధాన్యపు రాశులు పోశారన్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులలో ప్రభుత్వం వెంటనే కొనుగోలును ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సమావేశంలో ఆబపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, నాయకులు గడ్డం వెంకటేష్, ఈర్లపల్లి ముత్యాలు, వడ్డేబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.