Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీడబ్ల్యూయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ- వలిగొండ
సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకున్న ప్రతి భవన నిర్మాణ కార్మికునికీ బైకులు ఇవ్వాలని బీసీడబ్య్లూయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 8,9 తేదీల్లో మహబూబాబాద్ లో జరిగే యూనియన్ రాష్ట్ర 3 వ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్స్‌ను శుక్రవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మేడే సందర్భంగా నిర్మాణ కార్మికులకు లక్ష బైకు లు అందజేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ప్రమాద మరణానికి రూ.10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు, వివాహ - ప్రసూతి కానుకలకు లక్ష రూపాయల చొప్పున పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్, ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాధారపు మల్లేశం, చుక్క రాంచంద్రం, మండల అధ్యక్షులు సింగారం వెంకటేశం, నాయకులు ఉక్కుర్తి స్వామి, మల్గ కుమార్, పోలెపాక శంకర్, పల్లెర్ల రాజు, పల్లెర్ల లక్ష్మయ్య, శ్యామల సత్తయ్య, ఈతాప శ్రీను, సింగారం లక్ష్మయ్య, ఎలిమినేటి మల్లేశం, ఏటెల్లి నర్సింహ, శ్రీను, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు : మహబూబాబాద్‌లో ఈనెల 8, 9 తేదీల్లో జరిగే సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరెళ్ల నర్సింహ కోరారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టేలా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షుడు రాంపాక పాపయ్య, అధ్యక్షుడు ఎ.కె.శ్రీను, నాయకులు కూరెళ్ల ఉప్పలయ్య, కర్నాటి రవి, భీమవరం శ్రీను, చేకూరి నర్సింహ, చుక్క ముత్తయ్య, ఎ.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.