Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట డీఎల్పీఓ సాంబిరెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
నేషనల్ పంచాయతీ అవార్డుల కోసం 9 థీమ్స్లోని 113 ప్రశ్నావళికి సక్రమంగా సమాధానాలివ్వాలని డీఎల్పీఓ సాంబిరెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నేషనల్ పంచాయతీ అవార్డుల కోసం నిర్వహించిన చివ్వెంల,మోతె మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఇరు మండలాల పంచాయతీ కార్యదర్శులకు ఈ విషయమై దిశా నిర్దేశం చేశారు.ఈ నేషనల్ పంచాయతీ అవార్డులకు ఆన్లైన్ ఫ్రీజింగ్కు రెండు -మూడు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఒకటికి రెండుసార్లు ఈ-పంచాయతీ ఆపరేటర్లతో పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్ ద్వారా కూలంకషంగా వెరిఫై చేసుకుని ఒక్క తప్పు కూడా లేకుండా సరి చేసుకొని ఫ్రీజింగ్ కు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో చివ్వెంల ఎంపీడీవో లక్ష్మీ, ఎంపీఓ గోపి, మోతె ఎంపీఓ హరిసింగ్,ఇరు మండలాల పంచాయతీ కార్యదర్శులు,ఈ-పంచాయతీ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.