Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని అఖిల భారత వ్యవసాయ కార్మికసంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.శుక్రవారం మండలంలోని పెంచికల్ దిన్న గ్రామంలో నిర్వహించిన ఆ సంఘం మండల ఐదో మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. తమ రాజకీయ పబ్బం గడపడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వ్యవసాయ కార్మికులకు మాయమాటలతో మురిపిస్తూ మోసం చేస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపు నిచ్చారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిత్యావసరవస్తులు తగ్గిస్తామని గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన తర్వాత వాటి ధరలను మూడింతలు రెట్టింపు చేసిందని విమర్శించారు.బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బ్యాంకింగ్, రైల్వే, బొగ్గు తదితర రంగాలన్నీటిని అంబానీ,అధానిలకు కట్టబెట్టిందన్నారు.కనీస వేతన చట్టం సుప్రీంకోర్టు రూ.18000గా నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదన్నారు.ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, సాగునీటి వనరులు అనేక రకాలైన హామీలను ఇచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. అలాగే పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టాలివ్వాలని కోరారు.ఈ మహాసభలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొదమగుండ్ల నగేష్,జిల్లా సహాయకార్యదర్శి పోషణబోయిన హుస్సేన్, జిల్లా కమిటీ సభ్యులు సిరికొండ శ్రీను,కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, సీఐటీయూ మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి, అనెగంటిమీనయ్య, రైతుసంఘం నాయకులు పాతూరి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మికసంఘం మండల నాయకులు మచ్చ సోమయ్య,పాలకూరి రాములమ్మ, దోరేపల్లి సత్యం, పరిసరబోయిన సైదులు, నందమూరి బాబురావు, హరిబండి ప్రసాద్ రావు, బొప్పనిరాణి, ఉప్పెల్లి వెంకటేశ్వర్లు, రేపెల్లి భిక్షం, మడ్డిధనమ్మ, చలసాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.