Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
బీఎస్సీ వ్యవసాయం డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం ద్వారా వృత్తి నైపుణ్యత పొందిన విద్యార్దిని విద్యార్దులు నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని పొందగలిగారని ఈ విజ్ఞానాన్ని రైతులకు అందించడానికి కృషి చేయాలని కేవీకే ఇన్చార్జి సీనియర్ సైంటిస్టు అండ్ హెడ్ బి.లవకుమర్ అన్నారు.మండలపరిధిలోని గడ్డిపల్లిలో ఓరియంటల్ యూనివర్సిటీ ఇండోర్, మధ్యప్రదేశ్ చెందిన బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం ముగింపు సమావేశం లో ఆయన మాట్లాడారు.పలుఅంశాలపై సూచనలు చేశారు.కేవీకే శాస్త్రవేత్తల పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ గ్రామాలలో ఉంటూ వ్యవసాయ స్థితి గతులను అధ్యయనం చేస్తూ ఆతిథ్య రైతు క్షేత్రాలను సందర్శిస్తూ కేవీకేలో నూతన సాంకేతికపరిజ్ఞానం ను పంటల సాగులో మెళకువలను బోధిస్తూ విద్యార్థులకు కృషి అనుభవాన్ని కలగజేస్తున్నామని తెలిపారు.3 నెలల పాటు విద్యార్థులు గ్రామంలోనే ఉంటూ గ్రామీణ స్థితిగతులు వనరులు రైతులు పంటల సాగులో ఆచరిస్తున్న పద్ధతులు నూతన సాగు విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం మొదలగు అంశాలు అధ్యయనం చేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ప్రదర్శనలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహనా కల్పించా మన్నారు.గ్రామీణ కృషి అనుభవం పొందడం, ప్రాక్టికల్‌గా పంటలసాగు గురించి ఎంతో నేర్చుకొన్నామని, ఇది ఎంతగానో ఉపయోగపడిందని రావే విద్యార్థులు శివ, శ్రీకాంత్, ప్రేమ్, జగదీష్, చిన్మయి, అనూష, శిరీష వారి యొక్క అనుభవాలను తెలిపారు.అనంతరం గ్రామీణ కృషి అనుభవం పూర్తి చేసుకొన్న ఓరియంటల్ యూనివర్సిటీ విద్యార్థులకు లవకుమర్ సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఏ.కిరణ్, డి.ఆదర్శ్, డా టీ.మాధురి, ఏ.నరేష్,కంప్యూటర్ ప్రోగ్రామర్లతో పాటు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు.