Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
అకాలవర్షాలతో రైతుల జీవితాలు అతలాకు తలమవుతున్నాయి.మండలంలోని గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాలికి చేతికి వచ్చిన పంట నేలకొరిగింది. అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి.పట్టణంలోని పాత నేరేడుచర్ల పరిసర ప్రాంతాల్లో మండలంలోని పెంచికల్దిన్నె, కల్లూరు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాలికి పదుల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. పెంచికల్ దిన్నకు చెందిన కౌలు రైతు అల్వాల శ్రీధర్ అనే రైతు కౌలుకు చేస్తున్న 14 ఎకరాలలో పంట కోత సమయంలో నేలమట్టం కావడంతో అపారనష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు పంటల నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం ద్వారా రైతులకు సహాయం అందించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.