Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారం 100 శాతం జరగాలి
- కలెక్టర్ పాటిల్ హేమంతకేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని,పారిశుధ్యపనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పాటిల్హేమంత్ కేశవ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో చేపట్టిన పలు అభివద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో గుర్తించిన బస్తి దవాఖానలలో మౌలికవసతులు కల్పించి అందుబాటులోకి తేవాలన్నారు.అలాగే ఒక అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రంగా అన్ని హంగులతో తీర్చిదిద్దాలని తెలిపారు. ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా హరితహారం 100శాతం పూర్తి చేయాలన్నారు. అన్ని నర్సరీలలో అన్ని రకాల మొక్కలు పెంచాలని సూచించారు.పెండింగ్లో ఉన్న వైకుంఠదామాల పనులను సత్వరమే చేపట్టి మౌలికవసతులు కల్పించాలని ఆదేశించారు.పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులను పూర్తి చేసి ఆయా బిల్లులను సత్వరమే చెల్లించాలని ఆదేశించారు.మెప్మా ద్వారా అన్ని మున్సిపాలిటీలలో మహిళాసంఘాలకు సకాలంలో రుణాలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన వెజ్,నాన్ వెజ్ మార్కెట్ల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు సూర్యాపేట సత్యనారాయణ రెడ్డి, కోదాడ మహేశ్వర రెడ్డి, హుజూర్ నగర్ శ్రీనివాసరెడ్డి, నెరేడుచర్ల వెంకటేశ్వర్లు, తిరుమలగిరి డి.శ్రీను,పీడీ రమేశ్నాయక్ పాల్గొన్నారు.