Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థుల సమక్షంలో స్క్రూట్నీ 6న కౌంటింగ్
- జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మునుగోడు శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికల పోలింగ్ సజావుగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణం అర్జాల బావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో కౌంటింగ్ కేంద్రంలో ఉపఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో స్క్రూటినీ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు పంకజ్‌కుమార్‌తో కలిసి స్క్రూటినీ నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, ఓటింగ్ శాతంపై అభ్యర్థులకు వివరించారు. మాక్ పోలింగ్, పిఓ డైరీ, ఏ.ఎస్.డి. ఓటర్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు తదితర అంశాలపై అభ్యర్థులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉపఎన్నిక పోలింగ్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, పోటీ చేసిన అభ్యర్థులకు, ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకున్న ఓటర్లకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసినందున నవంబర్ 6వ తేదీన ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు పంకజ్ కుమార్, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్‌రావు, మునుగోడు రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్, ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు.