Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరిని ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ.సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య భవన్లో 8న జిల్లా మహాసభ నల్లగొండలో, 18, 19న రాష్ట్ర మహాసభలు హనుమకొండ జిల్లా కేంద్రంలో జరుగు మున్సిపల్ కార్మికుల జిల్లా, రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో, 11మున్సిపల్ కార్పొరేషన్లో128 మున్సిపాలిటీలలో 64 వేల మంది కార్మికులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎమ్ఆర్, ఫిక్స్డ్పై, డ్వాక్రా గ్రూపు తదితర పద్ధతులలో పనిచేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం ఈ మహాసభలలో చర్చించి కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఈ మహాసభలలో తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభల నిర్వహణకు ఉద్యోగులు కార్మికులు శ్రేయోభిలాషులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, కార్యదర్శి పెరికె కష్ణ, పందుల లింగయ్య, ఇస్రము పాండు, ఏర్పుల శ్రావణ్ కుమార్, మాచర్ల సైదులు, బొప్పని శ్రీనివాస్ పాల్గొన్నారు.