Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ సబ్ జైల్‌ను శుక్రవారం జువిసైల్ సభ్యులు డాక్టర్ గుగులోతు మోహన్‌రావు, పీ.లలితలు సందర్శించారు. జైల్లో ఖైదీలకు ఇచ్చే సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ జైల్లో 18ఏండ్ల లోపు వారిని ఉంచకూడదన్నారు. వారిని జువిసైల్కు పంపాలని కోరారు. పిల్లలు సత్ప్రవర్తన కలిగి ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపర్డెంట్ కే.లక్ష్మణ్‌బాబు, సిబ్బంది నరసింహులు, పీవీ.రత్నం, తదితరులు పాల్గొన్నారు.