Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైల్‌గా అమ్ముకున్న వైనం
- నోటు అలవాటు చేసిన నేతలు
- నోట్ల కోసం రోడ్ ఎక్కిన ఓటర్లు
- ఎన్నికలను బహిష్కరించిన తండా వసూలు
- ప్రజాస్వామ్యానికి ముంచుకొచ్చిన ప్రమాదం
ప్రపంచ దేశాల్లో ఓటు హక్కు కోసం ఎంతోమంది పోరాటాలు చేశారు. కానీ మనదేశంలో ఓటు హక్కు ఎంత విలువైనదో ఓటర్లకు తెలియడం లేదు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చి.. ఓటుకు నోటు అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయ విలువలే ప్రాధాన్యం..కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే భవిష్యత్తులో ఓటుకు రేటు నిర్ణయించే విధానం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఆయుధంగా ఉన్న ఓటు నేడు అంగట్లో సరుకుగా మారిపోయింది. ఓటుకు నోటు ఇస్తేనే ఓట్లు వేస్తామనే స్థాయికి చేరింది. మొన్న హుజురాబాద్ నేడు మూడుగోడు ఉపఎన్నికల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. గతంలో ఓటుకు నోటు ఇస్తే అది పెద్ద వార్త అయ్యేది. కానీ నేడు ఓటుకు నోటు ఇవ్వకపోతే ఓటర్లే ఆందోళన చేసి డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది. అక్షరాస్యతో సంబంధం లేకుండా సామాజిక స్పహతో మంచి నాయకున్ని ఎన్నుకునే ఓటర్లు తమ ఓటును నోటుకు అమ్ముకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎవరు ఎటు పోతే నాకేంది... నాకు మాత్రం నోటీస్తేనే ఓటేస్తామనే పరిస్థితి ఏర్పడింది. గంప గుర్తుగా ఓటర్లు ఓటును అమ్ముకుంటుంటే నేతలు దేశాన్ని అమ్ముకుంటున్నారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. ప్రజల చేత ఎన్నుకున్న నాయకుడు ప్రజా సమస్యల పరిష్కరిస్తారని నమ్మకం ఉండేది. అభివద్ధి చేస్తారని విశ్వాసం ఉండేది. ఆదిశగా గతంలో ఓటర్లు ఓటు అడిగేందుకు వచ్చిన నేతలను ప్రశ్నించేవారు. నీకు ఓటు వేస్తే మా గ్రామానికి ఏం చేస్తావ్ అని అడిగేవారు. ఆనాడు అక్షరాస్యత తక్కువ ఉన్నప్పటికీ ఓటు విలువ గుర్తుంచుకొని మంచి నాయకులను ఎన్నుకునేవారు. అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ ఓటర్లలో ఊహించని రీతిలో చైతన్యం వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఓటుకు ఎంత ఇస్తావనే స్థాయికి ఎదిగిపోయారని చెప్పుకుంటున్నారు. ఒక ఊరిలో
ఎక్కువ ఇచ్చిన మాకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటుకు 30వేలు, 40వేలు, తులం బంగారం ఇస్తామని ప్రచారం జరగడంతో ఎన్నికకు మూడు రోజుల ముందు ఓటర్లు నిద్రాహారాలు మాని నేతల కోసం ఎదురుచూసినట్టు సమాచారం. ఇరుపార్టీలు సమానంగా డబ్బులు పంచగా... మరో మారు ఎవరైనా డబ్బులు ఇస్తారేమోనని వేచి చూసి అదనంగా డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఓటరు బారులు తిరారని డబ్బులు ఇవ్వటం వలన ఓటింగ్ శాతం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని గ్రామాలలో డబ్బులు ఎందుకు ఇవ్వరని నేతలను ప్రశ్నించిన సంఘటనలు కూడా నెలకొన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఓటుకు నోటు అనే చైతన్యం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
కోట్లు ఖర్చు చేసిన నేతలు
ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కోట్లల్లో డబ్బును ఖర్చు చేశారు. రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నాటి నుండి ఉపఎన్నిక పోలింగ్ పూర్తి అయ్యేనాటి వరకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏకంగా 18 వేల కోట్ల రూపాయలకు బీజేపీకి అమ్ముడుపోయారు. ముందుగా గ్రామాల వారిగా ఉన్న ప్రజాప్రతి నిధులను లక్షల ఖర్చుపెట్టి తమ పార్టీల్లో చేర్చుకున్నారు. సర్పంచుకు 20 లక్షలు, ఎంపీటీసీకి 10 లక్షలు, ఎంపీపీ జెడ్పీటీసీలకు 50 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రచారం కోసం వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం రూ.500, క్వార్టర్ బాటిల్ ఇచ్చినట్టు సమాచారం. ఇలా నెలరోజుల పాటు పేడ్ ఆర్టిస్టులను నేతలు పోషించారు. గ్రామాల వారీగా ప్రచారం చేసేందుకు ఇన్చార్జిలను నియమించి వారికి లక్షల రూపాయలు ముందుగానే అందజేసినట్లు తెలిసింది. చివరికి పోలింగ్ ముందు ఓ పార్టీ ఓటుకు నాలుగు వేలు మరో పార్టీ ఓటుకు రూ.3000 ఇంకో పార్టీ ఓటుకు రూ.500నుంచి రూ.1000 రూపాయలు ఇచ్చినట్టు చర్చలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రతి ఇంటికీ క్వార్టర్ మందు అందించారు. అన్ని పార్టీలు కలుపుకొని నియోజకవర్గంలో సుమారు రూ.1000 కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టినట్టు సమాచారం. కేవలం రూ.200 కోట్లతో ఓట్లు కొనుగోలు చేసినట్టు నిఘవర్గాలు తెలుపుతున్నాయి.