Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 12, 13 ,14 తేదీల్లో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని మిధున స్టేడియం వద్ద గల డార్మెంటరీ హాల్లోలో జరిగే ఆట బాలోత్సవమును విజయవంత చేయాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక తన నివాసంలో ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆట బాలోత్సవం కరపత్రాన్ని ఆయన విడుదల చేసి మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ ఆట బాలోత్సవం ఎంతో గానో ఉపయోగ పడుతుందన్నారు. వినూత్న కార్యక్రమాలతో ముందుకు నడుపిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల వెంకటరెడ్డి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టి విజయవంతం చేయాలని వీరికి సహకరిస్తున్న టీం సభ్యులను ఎం.పి అభినందించారు. నూకల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ బిక్కంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆట బాలోత్సవం నందు ఆరు నుండి 14 సంవత్సరాల విద్యార్థులకు వ్యాసరచన, తెలుగు హాస్య కథల పోటీ, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, జానపదం, హాస్య నాటికలు, దేశభక్తి బృంద నృత్యాలు, ఫాన్సీ డ్రస్సు,భక్తి సినిమా పాటలు, గిరిజన సంప్రదాయ నృత్యాలు, రామాయణ ఘట్టాలు, వ్యర్థంతో అర్థం, ఏకపాత్రాభినయం, ప్రింట్ మేకింగ్ గారడి,ఆట మట్టితో బొమ్మల తయారీ, టి.ఎల్.ఎం. తదితర పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుడిపూడి వెంకటేశ్వరరావు, బడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.