Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య అధికారి కోటాచలం
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని 10-16 ఏండ్ల వయస్సు ఉన్న విద్యార్ధులకు తప్పనిసరిగా డిప్తిరియా, టెటనస్ వ్యాక్సిన్లు వేయించేలా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి కోటాచలం పేర్కొన్నారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో డిప్తిరియా, టెటనస్ వ్యాక్సినేషన్ల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ , ప్రయివేట్ు 1101 పాఠశాలల్లో 37516 అర్హత కలిగిన విద్యార్ధులు, బడీడు పిల్లలకు ఈ నెల 7 నుండి 17 వ వరకు ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు. దీర్ఘకాలీక వ్యాధులు కలిగిన పిల్లలకు ఈ టీకాలను వేయొద్దన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు శ్రీ అశోక్ డీిఈఓ, అనసూర్య బీసీ వెల్ఫేర్, దయానంద రాణి ఎస్సి వెల్ఫేర్, శంకర్ ట్రెబల్ వెల్ఫరే, జ్యోతి పద్మ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం, డీపీఆర్ఓ ఏ.రమేష్ కుమార్, డా. వెంకటేశ్వర్లు డీసీహెచ్ఎస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.పి.వెంకటరమణ పాల్గొన్నారు.