Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అర్వపల్లి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఎంపీపీ మన్న రేణుక లక్ష్మీనర్సయ్య యాదవ్ చేతుల మీదుగా పర్సయపల్లి జాజిరెడ్డిగూడెం. బొల్లంపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ఆరబెట్టి తాలు లేకుండా తీసుకువచ్చి సరైన మద్దతు ధరను పొందాలన్నారు . ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యాదగిరి రెడ్డి గ్రామ సర్పంచులు . పుప్పాల శేఖర్ కుంభం ఉష రాణి నాగరాజు దానం సుజాత యాదగిరి ఎంపీటీసీలు లు రాచకొండ గీత సురేష్ ,నర్సింగ నాగమ్మ శ్రీనివాస్, బొడ్డు భద్రమ్మ ,రామలింగయ్య మండల రైతు కోర్టినేటర్ పంది ఎర్ర నర్సయ్య , ఏపీ ఎం మల్లేష్ సిసిలు రైతు కోర్తినేటర్లు పంచాయతీ కార్యదర్శులు. ఉప సర్పంచులు పాల్గొన్నారు.