Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో ఎగుమతి, దిగుమతి చేసే హామాలీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని ఆల్ హమాలీ వర్కర్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కిరాణా ఫ్యాన్సీ అండ్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో మామిడి సుందరయ్య అధ్యక్షతన జరిగిన ఆల్ హమాలీ వర్కర్ ఫెడరేషన్ జిల్లా ద్వితీయ మహా సభలో ఆయన మాట్లాడారు. దేశంలో కోట్లాది మంది ఎగుమతి, దిగుమతి చేసి కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి ,వ్యాపారస్తులకు రావడానికి ఉన్న కానీ హమాలీల సంక్షేమానికి ఎలాంటి చట్టాలు లేకపోవడం అన్యాయమన్నారు. కేంద్రంలో బీజేపీి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క చట్టం కూడా కార్మికులకు తేకపోగా పోరాడి సాధించుకున్న 29 కార్మికులకు కుదించి నాలుగు లేబర్ కోడులు తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడి సాధించుకున్న విజయ స్ఫూర్తి తో లేబర్ కొడు లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ముప్పది వేల మంది ఎగుమతి దిగుమతి చేసే హమాలీ కార్మికులు వున్నారని తెలిపారు. వారికి పీఎఫ్, ఇఎస్ఐ అమలు కావడం లేదని తెలిపారు.పని చేసే చోట సౌకర్యాలు లేవని, ప్రమాదం లో చనిపోతే పట్టించుకునే నాథుడే లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అనంతు మైసయ్య, భీమపంగి వెంకన్న, మల్లెల వెంకన్న, అవిలయ్య, యాతకుల వెంకన్న, బి స్వరాజ్యం,శ్రీను, రామ నర్సు, పట్నం జిల్లా కార్యదర్శి జె.నర్సింహ రావు ,వేల్పుల వెంకన్న, చినపంగినర్సయ్య తదితరులు పాల్గొన్నారు.