Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశ్వరమ్మ, లింగారెడ్డి లపై చర్యలు తీసుకోవాలి
- గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-హాలియా
పెద్దవూర మండలం చలుకుర్తి రెవెన్యూ శివారు, కుంకుడు చెట్టు గ్రామం దగ్గరలోని సర్వే నెం 503,505,506,516,517,518 లలో భూమిని ఆక్రమించుకున్న శాగం ఈశ్వరమ్మ, కర్నాటి లింగారెడ్డి లపై చట్టపరమైన చర్యలు తీసుకొని గిరిజన పేద రైతులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలగిరి సాగర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్రెడ్డి నాగిరెడ్డి, ఎంపీపీ అంగోతు భగవాన్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం పట్టణఖేంద్రంలోని ఉద్యోగస్తుల విశ్రాంతి భవనంలో గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంగిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలకుర్తి శివారులో కుంకటి చెట్టు తండా గిరిజన రైతులు రామావత్ గ్యామ, రమావత్ లాలు, ప్రభుత్వ బంచరాయి భూమిని 40ఏండ్ల నుంచి సేద్యం చేస్తున్నారని వారికి అప్పటి నుంచి 2014 వరకు రికార్డులలో పహానిలలో వారి పేర్లే ఉన్నాయని తెలిపారు. 2018లో ధరణి వచ్చిన తర్వాత సాగం ఈశ్వరమ్మ రెవెన్యూ అధికారులు వీఆర్వో ఆర్ఐ ఎంఆర్ఓలను డబ్బులు ఇచ్చి అక్రమంగా రికార్డులలో పేరు నమోదు చేయించుకుని పట్టా పొందారని తెలిపారు. ఆ పట్టాను వెంటనే రద్దుచేసి నిజమైన రైతులైన గ్యామా లాలు పేరు మీద ఎక్కించాలని అధికారులను కోరారు మిగిలిన రైతుల భూములను పాస్ బుక్కులు ఉన్న వారికి భూమి మీదికి రానీయకుండా అనుచరులతోటి బెదిరిస్తున్నారన్నారు. ఆర్ఓఆర్లో కింద సగం ఈశ్వరమ్మ కుటుంబ సభ్యుల పేరు మీద ఎక్కిన భూమి పట్టాలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రికార్డును దొంగతనంగా పేర్లు ఎక్కించి పట్టాలు పొందారని ఇలాంటి పట్టాలను కూడా వెంటనే రద్దు చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఈశ్వరమ్మ లింగారెడ్డిల దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రతి విషయంలో లింగారెడ్డి పోలీసు రెవెన్యూ సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి గిరిజన పేద మధ్యతరగతి రైతులకు అనుకూలంగా పని చేయొద్దని బెదిరిస్తున్నారని తెలిపారు. అరాచకాలను అడ్డుకట్ట వేయించాలని గిరిజన పేద రైతులకు పట్టా పాస్ బుక్కులు ఇప్పించే వరకు అందరూ తోడుగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రామవత్ రవి నాయక్,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సపవాట్ పాండు నాయక్, జీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ నాగేందర్, నాయక్ హాలియా మున్సిపాలిటీ కౌన్సిలర్ డేపావత్ ప్రసాద్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ ,ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కారంపొడి ధనమ్మ, బుర్రి రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ దాశ్రు నాయక్,గిరిజన నాయకుడు రమా రాజేష్ నాయక్,మేరావత్ ముని నాయక్ , గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు రామవత్ నరేష్ నాయక్, అనుముల మండల అధ్యక్షులు అశోక్ నాయక్ నేనావత్,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనుముల మండల అధ్యక్షులు సభావట్ మోతిలాల్ నాయక,్ జటావత్ రవి నాయక్, ఆమ్గోత్ మమతా నాయక్,రవీందర్, నాగార్జున రెడ్డి ,బిక్షం రెడ్డి, శంకర్, కమలి, హాంసలి, తదితరులు పాల్గొన్నారు.