Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాల లబ్దిదారులు, బీసీ ఓటర్లు సైతం టీిఆర్‌ఎస్ వైపే
- కాంగ్రెస్ కు ఓట్లు రాల్చని మహిళా సెంటిమెంట్
- ఓటర్లను ఆకట్టుకోలేక పోయిన రాజగోపాల్ రెడ్డి
- కాంట్రాక్టుల కోసమే రాజీనామా ప్రచారం వర్కౌట్
- నేడు తేలనున్న ఫలితాలు
అత్యంత ఖరీదైన ఎన్నికగా కొనసాగిన మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విరివిగా డబ్బులు వెదజల్లి గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా బీజేపీ మునుగోడులో సంస్థాగత బలం లేకపోయినా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీిలో చేరడంతో గ్రామాల్లో పార్టీ విస్తరించుకోగలిగారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు పొంది రాజీనామా చేయడంతో వచ్చిన ఎన్నికల్లో ధనం, మద్యం ఏరులై పారింది. పోలింగ్‌లో నియోజకవర్గ ప్రజలు టీిఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్త్తోంది. నేడు నల్లగొండజిల్లాకేంద్రంలోని ఎస్ఎఫ్ఐ గోదాములో జరిగే కౌంటింగ్‌లో ఫలితాలు తేలనున్నాయి.
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులు ముఖ్యంగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత ,నేత కార్మికులు టీిఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు. వీరితోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కారు గుర్తుకే ఓటు వేసినట్టు ఆయా సర్వేల్లో తేలుతుంది. ఇక చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలోని ఓటర్లు, యూత్ ఓటర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జై కొట్టారు. సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి తండాల్లోని గిరిజన ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. గిరిజన ఓటర్లు ఎక్కువ శాతం రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తారని భావించినా రేవంత్ రెడ్డి ప్రచారం గిరిజన ప్రజల్లోకి దూసుకెళ్ల్లడంతో కాంగ్రెస్‌కు జై కొట్టినట్టు తెలుస్తుంది.
ఓటర్లను ఆకట్టుకోలేకపోయిన రాజగోపాల్ రెడ్డి
బీజేపీి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్‌ల కోసం రాజీనామా చేశారన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీనికి తోడు టీిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టులు తోడవడంతో బీజేపీని ఎండగడుతూ ప్రజల్లో విస్తతంగా ప్రచారం నిర్వహించారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య రాజీనామా చేసబీజేపీలో చేరడంతో గౌడ సామాజిక వర్గం ఓట్లు వస్తాయని ఆశించిన కూడా తగిన స్థాయిలో ఓట్లు పడలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం ఓట్లు పోలరైజేషన్ చేయడంలో టీిఆర్‌ఎస్ పార్టీ సక్సెస్ అయింది.
కమ్యూనిస్టుల తోడు... టీఆర్ఎస్కు మరింత బలం
నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన టీిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టు పార్టీలు తోడవడంతో మరింత బలం చేకూరింది. ప్రతి గ్రామంలోనూ టీిఆర్‌ఎస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇన్చార్జిలుగా నియమించడం టీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేసినట్లయ్యింది. ఇదే స్థాయిలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలను బూత్ స్థాయిలో ఇన్చార్జిలుగా నియమించిన వారి మాటలు ప్రజలు నమ్మకపోవడంతో బొక్క బోర్లా పడక తప్పలేదని ప్రజలు అంటున్నారు. ఓటర్లను పెద్ద ఎత్తున డబ్బులు పంచి కొనుగోలు చేయాలన్న ఎత్తుగడ పనిచేయలేదు.
కాంగ్రెస్‌కు పని చేయని మహిళా సెంటిమెంట్
కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపిన కూడా ఆ సెంటిమెంట్ పనిచేయలేదనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేసిన కూడా పోల్ మేనేజ్మెంట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రేవంత్ రెడ్డి నియమించిన గ్రామాల ఇన్చార్జులు క్షేత్రస్థాయిలో పనిచేయలేదు. పెద్ద పెద్ద నాయకులే ముఖం చాటేసి తిరిగారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని మొదలే ప్రారంభించిన అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదని విమర్శ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు నియోజకవర్గంలోని మహిళలతో సభ ఏర్పాటు చేసి వేడుకున్న కూడా ఓట్లు రాలలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల స్వయంకృతాపరాదం వల్ల కాంగ్రెస్ కు అనుకున్న స్థాయిలో ఓట్లు పడలేదు. డిపాజిట్ అయిన దక్కుతుందా అనే సందిగ్ధం లేకపోలేదు. ఉత్కంఠతగా కొనసాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కెసిఆర్ నిర్వహించిన సభలు, రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయారని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న మునుగోడులో టీఆర్ఎస్కు కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం, గ్రామీణ ప్రాంత ఓటర్లంతా టీఆర్ఎస్ కి జై కొట్టడం వల్ల టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని కనిపిస్తుంది.నేడు జరిగే కౌంటింగ్‌లో గెలుపు ఎవరిదో తేలిపోతుంది.