Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-తుర్కపల్లి
జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభం కాలేదని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకటాపురం గ్రామంలో ఐకేపీ సెంటర్లో రైతులు పోసిన ధాన్యాన్ని స్థానిక ఆ పార్టీ నాయకత్వంతో కలిసి సందర్శించి రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ..జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాల్లో రైతులు కష్టపడి పండించిన పంటను కోసి అమ్మడం కోసం మార్కెట్ యార్డులో గత 25 రోజుల కింద మార్కేట్లో పోయడం జరిగిందని నేటికీ కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులలో ప్రభుత్వం వెంటనే కొనుగోలును ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కొనుగోలు ప్రారంభించిన వేగంగా కొనుగోలు జరగడంలేదని దానికి సరిపడా హమాలీలను పెంచాలన్నారు. ఇంకా జిల్లావ్యాప్తంగా చాలా గ్రామాలలో ధాన్యం మార్కెట్ యార్డులలోకి చేరిన కొనుగోలు ప్రారంభించలేదని దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ఇంకా ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం,మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, మండల నాయకులు కొక్కొండ లింగయ్య,తూటి వెంకటేశం, గడ్డమీది తలారి మాతయ్య రైతులు గుంటి రాములు గుంటి మహేష్ సప్న తదితరులు పాల్గొన్నారు.
కల్లూరి రామన్నను పరామర్శించిన సీపీఐ(ఎం) జిల్లా నాయకులు
కాంగ్రెస్ఆలేరు నియోజకవర్గ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు కల్లూరి శ్రీపతి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శనివారం మండలంలోని వెంకటపురం గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పరామర్శించారు. పరామర్శించిన వారిలో జిల్లా నాయకులు కొలుపుల వివేక్, మండల కార్యదర్శి పోత రాజు జహంగీర్, గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొక్కొండ లింగయ్య ,మండల నాయకులు తలారి మాతయ్య, గడ్డమీది నరసింహ, తూటి వెంకటేశం ఉన్నారు.