Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్కు మున్సిపల్ ఇంజనీరింగ్ డీఈ మందలింపు
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని 10వ వార్డు అన్నెపువాడలో చేస్తున్న సీసీ రోడ్డు పనులను కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా చేస్తుండటంతో కాలనీవానులు ఆ పనులను అడ్డుకున్నారు. కంకర, సిమెంట్, ఇనుకతో సీసీ నిర్మించాల్సి ఉండగా కాంట్రాక్టర్ కంకర, డస్ట్ తో సీసీ వేస్తుండటంతో ఇలా నాణ్యత లేకుండాఇష్టారాజ్యంగా ఎలా వేస్తారని కాలనీవాసులు కాంట్రాక్టర్ ను నిలదీయడంతో పనులను ఆపేసి వెళ్లిపోయారని తెలిపారు. శనివారం తిరిగి చేస్తున్న పనులను పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ డీఈ బి.మనోహర పరిశీలించారు. గ్రౌండ్ లెవలింగ్ సరిగా చేయకపోవడం, పనులను నాణ్యత లేకుండా ఇష్టారీతిన చేస్తుండటాన్ని గమనించిన డీఈ కాంట్రాక్టర్ ను మందలించారు. మిమ్ములను నమ్మి పనులనుఅప్పగించినప్పుడు ఇలా చేస్తే ఎలా అని, అధికారులం మేం ఇక్కడే ఉండి పనులు చేయిస్తే మీరెందుకని ప్రశ్నించారు. పనులను నాణ్యతగా చేయాలని, లేనిపక్షంలో క్వాలిటీ సెల్ ఆఫీసర్లు వచ్చి పరిశీలిస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.