Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
ఉపాధ్యాయ ,విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కర్ల యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం పోచంపల్లి మండలంలోని మోడల్ స్కూలు బీసీ గురుకుల కేజీబీవీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు క్యాంపనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కనీసం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయుల కోసం పనిచేసే ఉపాధ్యాయుల సమస్యల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులను ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు ఈ శ్రీనివాస్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి జి ప్రభాకర్ రెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.