Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాల్లోనూ ధాన్యం కోనుగోలు కేంద్రాల ప్రారంభించాలని రైతు సంఘం జిల్లాకార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని నమాత్ పల్లి పీఏసీఎస్ కొనుగోలు సెంటర్ ను రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ పంట కోసి మార్కెట్ యార్డులో ధాన్యం పోసి నెలరోజులవుతున్నా నేటికీ కొనుగోలు చేయలేదన్నారు. గతపంట సీజన్లో అకాల వర్షాలు కురిసి మార్కెట్ యార్డులో తడిసినష్ట పోయారన్నారు. ఆకాశం మబ్బులు కమ్ముకుంటే రైతుల గుండెలు బిగపట్టుకొని ఆందోళన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నమాత్ పల్లి కేంద్రము లోగత నెల 6తేదీన మార్కెట్ కు దాన్యం తేగా ఇప్పటి వరకు 52 మంది రైతులు ధాన్యం కుప్పలిపోసి కాపలా కాస్తున్నారు, ఇ ప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయటం ప్రారంబించ లేదు అని వెంటనే కోనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వం గన్ని బ్యాగులు సరఫరా చేసి కోనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా అంజి రెడ్డి, రైతులు జిట్టా పాండు రంగా రెడ్డి, తెల్జీరి మల్లేష్, నాగు శ్రీనివాస్, జిట్ట పెద్ద లక్ష్మా రెడ్డి, జిట్ట పెద్ద రాజి రెడ్డి, కంబాలపల్లి లలిత అవుల రాములు, జిట్టా ఎట్టా రెడ్డి , జిట్ట ముత్తమ్మ, జీట్టా భారతమ్మ, జిట్ట సిద్దమ్మ, బబ్బురి ఇంద్ర ఎల్లాంల లక్ష్మమ్మ పాల్గొన్నారు..