Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల సహకారంతో బొగ్గుబట్టి వ్యాపారుల తతంగం
నవతెలంగాణ- ఆత్మకూరు ఎస్
చెట్లను పెంచాలంటూ ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ మరోవైపు రోడ్ల వెంట పెరిగిన భారీ చెట్లను ఇష్టానుసారంగా నరికి వేస్తున్నవేస్తున్నారు. ముక్కుడుదేపల్లి శివారులో వెలుగు చూసింది. సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై బొగ్గుబట్టి వ్యాపారి ఇష్టానుసారంగా నరికేస్తున్నారు.బయ్య సోమయ్య వ్యవసాయ క్షేత్రం సమీపంలో బొగ్గుబట్టి నిర్వాహకుడు బండారు శ్రీను చెట్లను నరికి బొగ్గు బట్టీల కు తరలిస్తున్నాడు. ఈ విషయమై బొగ్గుబట్టి వ్యాపారి శ్రీను తో మాట్లాడగా అధికారులు చెట్లని కోట్టుకు పొమ్మన్నారని చెప్పారు. రోడ్ల వెంట పెద్ద చెట్ల నరుకుతున్న విషయమై ఆర్ అండ్ బి. ఈ ఈ మహిపాల్ రెడ్డిని వివరణ కోరగా తొలగించాలని చెప్పాను తప్ప మంచిగున్న పెద్ద చెట్లను నరికి వేయరాదంటూ అలాచేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.