Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
తిరుమలలో కూల్చివేసిన అన్నమయ్య గృహాన్ని విగ్రహ ప్రాంగణాన్ని తిరిగి నిర్మించాలని అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి డిమాండ్ చేశారు అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర సోమవారం యాదగిరిగుట్టకు చేరుకుంది ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం రెడ్డి సత్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెల రోజుల నుండి రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్రలో భాగంగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నామన్నారు.2003లో తిరుమల కొండపై కూల్చేసిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని,ఆంజనేయ విగ్రహాన్ని యధా స్థానంలో టీటీడీ బోర్డు వెంటనే నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో అన్నమయ్య గృహ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదిజ్ఞాసి దున్న లక్ష్మేశ్వర్,ప్రచార కార్యదర్శి పిఎన్ మూర్తి,ఉపాధ్యక్షులు వీరన్న ,రేణుక గౌడ్ ,జై భారత్ జాతీయ కార్యదర్శి సత్యనారాయణ ,పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకన్న ,ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ సుధాకర్ ,కార్యదర్శి ఈమెయ్య వృత్తి కళాకారుల సంఘం నాయకులు వెంకట్ రెడ్డి ,రాజేష్ ,జై భారత్ రాష్ట్ర నాయకులు రాఘవ దాస్ ,లావణ్య ,రాజు గీత వెంకట్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.