Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధర పొందాలని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ఎదుళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో సీఈవోకె.వరలక్ష్మీ కోరారు. వ్యవసాయ మార్కెట్ లో, మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం వారు వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యానికి క్వింటాలు ఏ గ్రేడ్ కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర ఇస్తుందని, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, కౌన్సిలర్లు లెంకల సుజాత,ఎర్రవెల్లి మల్లమ్మ, టీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధానకార్యదర్శి గజ్జి మల్లేష్, తొంట భాస్కర్, తొంట శ్రీను, సూపర్ వైజర్ ఎం.శివకుమార్, సిబ్బంది శ్రీకాంత్, యాదగిరి, పాండు, నరహరి తదితరులు పాల్గొన్నారు.