Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఆర్ఎం రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
స్థానిక సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి అభ్యర్థన మేరకు ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆర్టీసీ అధికారులు రెండో బస్సులను ప్రారంభించారు.ఈ బస్సులను స్థానిక ఎంపీపీ గుత్త ఉమాదేవి, సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి,ఎంపీటీసీ బచ్చన గోని గాలయ్యతో కలిసి రీజనల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభిం చారు.ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ అభ్యర్థన మేరకు ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా ఈ బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఎంతో శ్రేయస్కరం అన్నారు.ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణంతోపాటు కుటుంబానికి భరోసా ఉంటుందన్నారు.ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.హయత్ నగర్1 డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు నారాయణపురం నుండి దిల్షుక్నగర్ వరకు రోజుకు 8 పర్యాయాలు తిరుగుతాయన్నారు. నారాయణపురం నుండి దిల్షుక్నగర్ కు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై 6 గంటలకు,8:50,9:50, మధ్యాహ్నం 2:30, 3.30,6:30, 7.30 కి ఆఖరి బస్సు బయలుదేరుతాదన్నారు. దిల్షుక్నగర్ నుండి నారాయణపురం 6.50,7.50, మధ్యాహ్నం 12.45,1.45,4.30,5.30,8.15, 9.15 గంటలకు దిల్సుఖ్గర్ నుండి నారాయణ పురంకు ఆఖరి బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్1 డిపో డిఎం టి.రఘు, కే.రమేష్, సూపర్డెంట్ కే.కృష్ణయ్య, స్టాండింగ్ మేనేజర్ కే. శంకరయ్య, ఇందు, విజయ, శంకరయ్య, స్థానిక నాయకులు వడ్డేపల్లి రాములు,గుత్తా ప్రేమ్చందర్ రెడ్డి,చిలువేరు బిక్షం, శికిలమెట్ల వెంకటేశం,ఎండి షరీఫ్, కర్నే భాస్కర్, చిలువేరు బిక్షపతి,రాజమౌళి,బల్లెం రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.