Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాలకు బస్సులు రాక విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు బస్సులు నడపాలని బస్సు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బస్సులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భువనగిరి -పులిగిల్ల రూట్లో ఒకటే బస్సు సర్వీస్ నడపడంతో 12 గ్రామ పంచాయతీల నుంచి ఈ బస్సు సర్వీస్ నడుస్తుందని అన్నారు. ఒకటే బస్సు సర్వీస్ నడవడంతో ఈ బస్సులో పరిమితికి మించి ప్రయాణం చేస్తూ కళాశాలకు విద్యార్థులు వస్తున్నారని అన్నారు. రామన్నపేట-అమ్మనబోలు బస్సు రాక విద్యార్థులు కళాశాలకు వచ్చి చదువుకోవాలంటే రోజువారీగా 70 రూపాయలు వెచ్చించి ప్రయివేటు వాహనాలల్లో వస్తున్నారని అన్నారు. రాజపేట -ఆలేరు , ఆలేరు -తూర్పు గూడెం రూట్లలో బస్సులు రాక విద్యార్థులు చదువుకోలేకపోతున్నా రన్నారు. బస్సు సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ఈర్ల రాహుల్ చింతల శివ పట్టణ నాయకులు నెలిలిగొండ వినరు హుస్సేన్ సాగర్ విక్రమ్ విజరు రాము శివ పాల్గొన్నారు.