Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరి రూరల్
అందరూ ఆధార్ నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం తన ఛాంబర్ లో ఆధార్ రెన్యువల్ ప్రచార పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివద్ధి పథకాలు పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ నవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. 2016 కంటే ముందు ఆధార్ గుర్తింపు కార్డు పొందిన వారంతా యూఐడీఏఐ ఆదేశాల ప్రకారం సంబంధిత పత్రాలతో ఎyaaసష్ట్రaతీ.బఱసaఱ.స్త్రశీఙ.ఱఅ ద్వారా, లేదా ఆధార్ నమోదు కేంద్రాలను సంప్రదించాలన్నారు. వివిధ ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్ , సిమ్ కార్డు తీసుకునేందుకు, రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు వివరాలను కూడా ఆధార్ కు అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఆధార్ నవీకరణ ప్రక్రియకు సంబంధించి ప్రజలకు తెలిసేలా అన్ని మండల కార్యాలయాలలో తగిన చర్యలు తీసుకోవాలని మీసేవ ఈ- డిస్టిక్ మేనేజర్ నీరటి సాయి కుమార్ ని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎ.నాగేశ్వర చారి, ఆధార్ సేవా కేంద్రాల జిల్లా మేనేజర్ నరేందర్, మండల ఆధార్ సేవా కేంద్రాల ఆపరేటర్లు పాల్గొన్నారు.