Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి విమర్శించారు.సోమవారం స్థానిక ఎంవీఎన్భవన్లో జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశంలో బీజేపీ 8 ఏండ్ల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై హత్యలు,దాడులు పెరిగాయన్నారు.దళితుల పేదల ఉపాధి వనరుగా ఉన్న ఉపాధిహామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని నీరుగార్చి పేదల పొట్టలు కొట్టిందన్నారు.నీతి ఆయోగ్ సాకుతో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ బడ్జెట్ అమలు చేయకుండా దేశంలో 20 శాతం ఉన్న దళితులకు ద్రోహం చేసిందన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకించి యూపీలో దళితులు అభద్రతతో బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ కార్పోరేట్శక్తులకు అమ్ముతూ రాజ్యాంగ హక్కులను రిజర్వేషన్లు లేకుండా సామాజిక న్యాయానికి సమాధి చేస్తుందని విమర్శించారు.దేశంలో దళితులను హీనంగా చూస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చేసిన ప్రయత్నాలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నందిగామ సైదులు,సుధాకర్,డి.దుర్గారావు జిల్లా సహాయ కార్యాదర్శి పిండిగ నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు ఇరుగు రమణ,గిరి తదితరులు పాల్గొన్నారు.