Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఉపఎన్నిక గెలుపుతో మంత్రి హ్యాట్రిక్
- కలిసొచ్చిన వామపక్షాల పొత్తు
నవతెలంగాణ-సూర్యాపేట
మునుగోడులో జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ వామపక్షాల పొత్తుతో విజయం సాధించడంతో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని నెలల తేడాతో జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను గెలిపించిన ఘనత మంత్రికే దక్కిందని చెప్పొచ్చు.మునుగోడు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కేసీఆర్ చేసిన సూచనల మేరకు క్షేత్రస్థాయి నుంచి కీలకంగా వ్యవహరిస్తూ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపులో కీ రోల్ పోషించారు.కేసీఆర్ వ్యూహాలను, సూచనలు సమర్థవంతంగా అమలు చేసి సక్సెస్ అయ్యారు.ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి తన పట్టును మరింతగా బిగించారు.కాంగ్రెస్ కంచుకోటలు అనుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీవి మంచుకోటలు అని మునుగోడు ఎన్నికలతో మంత్రి నిరూపించారు.ఇక టీఆర్ఎస్ కంచుకోటగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ లకు తావులేదని మునుగోడు విజయంతో మంత్రి రికార్డు సృష్టించారు.ఈ క్రమంలో పరిశీలిస్తే....2018 తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోనూ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి.మొదటది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా కారణంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ ఉపఎన్నిక కాగా.. రెండోది నోముల నర్సింహయ్య మరణం కారణంగా వచ్చిన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఉపఎన్నిక.ఇక్కడ కూడా మంత్రి జగదీశ్‌రెడ్డే ఇన్చార్జిగా వ్యవహరించారు.రెండు సీట్లను కూడా మంత్రి సారథ్యంలో టీఆర్ఎస్ గెలుచుకుంది.తాజాగా జరిగిన నల్లగొండ జిల్లాలోని మునుగోడుకు ఉపఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించి మంత్రి హ్యాట్రిక్ కొట్టారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వ్యూహకర్త గా వ్యవహరించి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించడంలో తనదైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయం నుండి ప్రస్తుతం వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుడి భుజం గా మంత్రి ఉంటున్నారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీష్ రెడ్డిని ట్రబుల్ షఉటర్ గా ప్రయోగించే వారు.ఈ దశలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొన్న హుజూర్నగర్, నిన్న నాగార్జునసాగర్ , నేడు మునుగోడు ఉపఎన్నికలలో మంత్రికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.కేసీఆర్ తనపై ఉంచిన గురుతర బాధ్యతను మంత్రి సమర్ధవంతంగా నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి రూ.18000 కోట్ల కాంట్రాక్టు, మొబలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.600 కోట్లు మంజూరు..అందుకు ప్రతిఫలంగా బలవంతంగా రుద్దిన మునుగోడు ఉపఎన్నికల ఫలితం అనే ప్రచారాన్ని మంత్రి ప్రజల్లోకి తీసుకెళ్లారు.బీజేపీ ఢిల్లీ బాసులు చేసిన వ్యూహ ప్రతివ్యూహాలను ఛేదించడం...అదేవిధంగా సీపీఐ(ఎం),సీపీఐలతో పొత్తు కలిసిరావడంతో టీఆర్ఎస్ విజయబావుటా ఎగరడానికి మంత్రి కృషి చేశారు.సాధించిన ప్రతి విజయ రహస్యం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికల అమలుతో పాటు అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఆచరణలో పెట్టడమే మంత్రి విజయ రహస్యమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.అదే సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సలహాలు, సహకారంతో మంత్రి ఉమ్మడి జిల్లాలో తన హవా కొనసాగిస్తున్నారు. మౌనమునిగా ఉంటూనే ఉపఎన్నికల్లో అద్భుతమైన విజయాలను నమోదు చేసుకొని ప్రతిపక్షాల ఉనికిని ప్రశ్నర్దాకంగా మార్చారు.దీంతో గులాబీ శ్రేణులు హ్యాట్సాఫ్ చెబుతున్నాయి.తెలంగాణ ఉద్యమం ఆరంభం నుండి కేసీఆర్ అడుగులో అడుగై అధినేత ఆదేశాలను అమలు పరుస్తూ అటు సంక్షేమం ఇటు అభివద్ధి లోనూ అద్భుతమైన ప్రగతిని సాధించడమే కాకుండా శత్రుదుర్బేద్యాన్ని ఛేదిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 12 కూడా టీఆర్ఎస్ అని మంత్రి నిరూపించి అజాతశత్రువుగా నిలిచిపోయారు.