Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక ఆరోగ్యబృంద సభ్యురాలు డాక్టర్ జ్యోతి రావత్
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర వైద్యబృందం సభ్యురాలు డాక్టర్ జ్యోతి రావత్ అన్నారు. సోమవారం జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు,15వ కామన్ రివ్యూ కమిషన్ తరపున డాక్టర్ జ్యోతిరావత్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆరోగ్య బృందం సభ్యులు పట్టణంలోని సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు.వివిధ పథకాల గురించి క్షుణ్నంగా లబ్దిదారులతో మాట్లాడారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న స్పెషాలిటీ సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పథకాల అమలు తీరును పరిశీలించారు.ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకరలు, అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడి పథకాల తీరును తెలుసుకున్నారు.బృందం సభ్యురాలు డాక్టర్ జ్యోతిరావత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.జిల్లావ్యాప్తంగా మరికొన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను పరిశీలించామన్నారు.అత్యుత్తమ సేవలను రోగులకు అందించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.క్షయ వ్యాధి రోగుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని, వారికి మాత్రలు పంపిణీ చేయాలని కోరారు. రోగి వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని కోరారు.ఈ కార్యక్రమంలో కేంద్ర అధికారుల బృందం సభ్యులు డాక్టర్ అమీన్, డాక్టర్ తపస్, డాక్టర్ గౌరవ్, రాష్ట్ర అధికారుల బృందం సభ్యులు డాక్టర్ రామకృష్ణ, జేవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ కోటాచలం, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజిని, డిప్యూటీ డీిఎంహెచ్‌ఓ డాక్టర్ నిరంజన్, డాక్టర్ హర్షవర్ధన్, జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి వెంకటరమణ, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా మాతా శిశుసంరక్షణ అధికారి జయ, అంజయ్య, వీరయ్య, కిరణ్, భూతరాజు సైదులు, యాదగిరి, థామస్, అరుణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.