Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు,ఫీజురీయీంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రమావత్ లక్ష్మణ్ ,బుడిగ వెంకటేష్ డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.రెండేండ్ల నుంచి స్కాలర్షిప్లు,ఫీజురీయీంబర్స్మెంట్ను ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు.దీంతో విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయన్నారు.ప్రయివేట్ కళాశాలలో విద్యార్థుల దగ్గర నుండి నేరుగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అంతేకాకుండా ప్రభుత్వ కళాశాలలో కూడా ఫీజు రీయీంబర్స్మెంట్ విడుదల కాకపోవడం ద్వారా విద్యార్థులలో నుండి డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో దున్న రవి, పెరిక చింటూ, రాము, మంజుల,శ్రీజ, రమణ, వేద, తదితరులు పాల్గొన్నారు.