Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల కోసం ప్రవేశపెట్టిన గొర్ల పంపిణీ పథకాన్ని గొర్ల కాపరులకు నగదు బదిలీ చేయడం ద్వారా నడిపించాలని కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌చార్జ్జి బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. గురువారం పట్టణకేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల ముందు పంపిణీ కాకుండా నగదు బదిలీ చేస్తా అని చెప్పి ప్రస్తుతం ఎన్నికల అయిపోయిన తర్వాత గొర్రెలే పంపిణీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.మునుగోడు ఎన్నికల్లో మరోసారి గోల్ల కురుమల్ని కేసీఆర్ మోసం చేశారని ఆవేద వ్యక్తం చేశారు.మునుగోడులో గొల్ల కురుమల కట్టిన డీడీలకు నగదు బదులు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీని నిర్వీర్యం చేసి గొర్రెలు పంపిణీ చెస్తమనడం ఎంతవరకు పద్ధతి అని ప్రశ్నించారు.గొర్లు పంపిణీ చేస్తే లబ్ధిదారులకు న్యాయం జరగకుండా కమిషన్ ఎక్కువ పోతున్నాయని మాట్లాడిన ముఖ్యమంత్రి మళ్లీ గొల్ల కురుమలకు గొర్రెలు ఏలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు,గొల్ల కురుమల మద్దతుతోనే కేసీఆర్ గెలిచాడు అన్నారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ ,కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ ,నాయకులు బందరపు బిక్షపతి ,గుండ్లపల్లి ముత్యాలు ,ఆకుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.