Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబర్ 13 నుండి 16 వరకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం మహాసభలకు సంబంధించిన కలపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభలకు దేశంలోని 29 రాష్ట్రాలు, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 800 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. విద్య రంగ సమస్యల పరిష్కారానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నిరంతరం పోరాటలు నిర్వహిస్తూ దేశంలో 50 లక్షల సభ్యత్వం కలిగిన అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ ఉందిన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ విద్యను అంగట్లో సరుకు లాగా మార్చి పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. పాఠంశాలలో మార్పులు చేస్తూ మతతత్వ ,మూఢనమ్మకాలను పెంచే విధంగా సిలబస్ తీసుకొస్తున్నారని, దేశంలో కార్పొరేట్ విద్య కు వ్యతిరేకంగా నిరంతరం ఆందోళన చేసే సంఘం ఎస్ఎఫ్ఐ అని అందువల్ల భవిష్యత్ కార్యచరణ రూపొందించడం కోసం నిర్వహించే అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం రాజు, ఆనంద్, సతీష్, శ్రీవల్లి, విద్యార్థులు పాల్గొన్నారు.