Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మున్సిపాలీటి 7వ వార్డు బాబా సాహెబ్ గూడెం నుండి తండు నాగరాజు గారి ఆధ్వర్యంలో 100 మంది యువకులు ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, వై సైదిరెడ్డి, నాయకులు సదానందం, గుర్రం గణేష్ తదితరులు పాల్గొన్నారు.