Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
రాయగిరిలో గొర్రెల దొంగతనం చేసిన వారిని వెంటనే పట్టుకొని, దొంగతనాలను అరికట్టాలని గొర్రెల మేకల పెంపొందారుల సంఘం జిల్లా అధ్యక్షులు దయ్యాల పోలీసులను కోరారు. గురువారం ఆయన రాయగిరిలో గొర్రెలు దొంగతనం జరిగిన గొర్రెల దొడ్డిని పరిశీలించి మాట్లాడారు. అక్టోబర్ 26వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొర్రెలను దొంగిలించారని, ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి దొంగలను గుర్తించాలని కోరారు. ప్రభుత్వం భూములలో ఒకే దగ్గర గొర్రెల దొడ్లు ఏర్పాటు చేసుకునే సౌకర్యం కల్పించాలని, ఆ ప్రదేశం వద్ద ప్రభుత్వ నిగా కేంద్రాలు ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయగిరి సొసైటీ అధ్యక్షులు మన్నేబోయిన రాజలింగం, ఎం ఐల్లయ్య, మల్లయ్య, మేకల నర్సింహా, మచ్చ ఐల్లయ్య మచ్చ శ్రీశైలం, మేకల మల్లేష్, వెంకటేష్, ఎం మల్లేష్ లు పాల్గొన్నారు.