Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత ఖర్చులతో రోడ్డుకు మరమ్మతులు
- తాత్కాలికంగా తీరిన అన్నదాతల అవస్థలు
నవతెలంగాణ-పాలకవీడు
ఎంపీపీ గోపాల్‌నాయక్ తన ఉదారతను చాటుకున్నారు. మండలంలోని ఓ ప్రధానలింకు రోడ్డుకు తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. మండలకేంద్రం నుండి బొత్తలపాలెం, అలింగాపురం, గ్రామాల నుండి వెళ్లి రహదారి అధ్వానంగా తయారైంది. కల్వర్టుల వద్ద, మిషన్ భగీరథపైపులైన్లు వేసిన వద్ద ప్రయాణానికి ప్రమాదం పొంచి ఉంది. రైతులు వరిధాన్యాన్ని ఈ మార్గం గుండానే మార్కెట్‌కు తరలిస్తు ఇబ్బందులు పడుతున్నారు.అనేక సందర్భాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి సైతం గురయ్యారు.ఈ లింకు రోడ్డు నూతననిర్మాణానికి శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న చర్చ మండలంలో కొంతకాలంగా జరుగుతుంది.గతంలోఈ రోడ్డుపైనున్న గుంతలను మట్టితో పూడ్చి తాత్కాలికమరమ్మతులు చేశారు.ఈ నామమాత్రపు మరమ్మతులు చేసిన ప్రతిసారీ కొన్ని రోజుల్లోనే రోడ్డు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చి, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఎంపీపీ పేర్కొంటున్నారు. పరిసర గ్రామాల రైతుల కోరిక మేరకు తాత్కాలిక మరమ్మతులు చేయించామన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామీణప్రాంత రోడ్లకు నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు..ఈకార్యక్రమంలో అలింగాపురం సర్పంచ్ లక్ష్మమ్మ,వీరారెడ్డి బొత్తలపాలెం సర్పంచ్ భోగాల వీరారెడ్డి, పాలకవీడు ఎంపీటీసీ మీసాల ఉపేందర్ పాల్గొన్నారు.