Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
రైతులకు మెరుగైన సేవలందిస్తున్నామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం మండలకేంద్రంతో పాటు మామిళ్లగూడెం, ఇవాళపురం, బుర్కచర్ల, రావిపహాడ్,ఉర్లుగొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యలను చక్కగా పరిష్కరిస్తున్నమన్నారు గత పాలకుల హాయంలో పాలేరు జలాలు అతి సమీపంలో ఉన్న రైతులకు నీరందించడంలో విఫలమైందన్నారు.ఎడారి ప్రాంతంగా ఉన్న మోతే మండలానికి కాలేశ్వరం జలాల అందించి సస్యశ్యామలము చేస్తున్నామన్నారు.గతంలో పరుపు బండలుగా ఉన్న భూములను సాగు చేసి పంటలు పండిస్తున్నారన్నారు.విద్యుత్, నీటికష్టాలను అధిగమించా మన్నారు. పంటల సాయానికి వ్యాపారుల వద్ద అప్పులు చేసి అన్నదాత దగాపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేలచొప్పున రెండ్లు సార్లు రూ.10 వేలు పెట్టుబడిసాయం చేస్తున్నామన్నారు.పండించిన ప్రతిగింజనూ కొంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు మెట్టు అలివేలు నారాయణరెడ్డి, చెరుకుపల్లి ఎల్లయ్య, ఏపూరి వీరస్వామి,కర్నాకర్రెడ్డి, మామిడి అనిత వెంకటేశ్వర్లు ,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు, వెలుగు మండల సమాఖ్యఅధ్యక్షురాలు దోసపాటి రమణ,వీబీకే మంగమ్మ, సామపెదరాంరెడ్డి, ఎంపీడీఓ వెంకటాచారి, ఏపీఎం వెంకయ్య పాల్గొన్నారు.