Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలంలోని, అప్పన్నపేట గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగనిర్మాత, ప్రపంచ మేధావి అయిన డాక్టర్బీఆర్అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్,ఎంపీటీసీలైన యడవెల్లి చంద్రారెడ్డి,కడప ఇసాక్ మాట్లాడారు.అంబేద్కర్ విగ్రహం మన గ్రామంలో నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.అంతేకాదు అంబేద్కర్ ఒక కులానికో,మతానికో చెందిన వారు కాదన్నారు.ఆయన అందరి వారన్నారు.ఈనాడు గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుండి మొదలుకొని డిల్లీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థ నడుస్తుందన్నారు.అనంతరం డప్పు సతీష్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలైన డప్పు వాయిద్యాలతో అందర్ని అలరించాయి.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామకృష్ణ త్రిపురాంబ,అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అమరవరపు సతీష్,అమరవరపు విజరుకుమార్,అమరవరపు గిరి, అమరవరపు ఆశోక్,అంబేద్కర్,అమరవరపు నాగేందర్ బాబు, ఇంజ మూరి ఆశోక్, బచ్చలకూరి సంతోష్‌బాబు, బచ్చలి కూరి సతీష్, అమరవరపు రవి,అమరవరపు చంటి, నందిపాటి నాగరాజు అమరవరపు సైదులు, అమరవరపు నగేష్, అమరవరపు ప్రవీణ్, ప్రశాంత్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బరిగెల విజయ్ కుమార్,ఎంపీడీఓ పాపగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.